టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్‌లోనూ ఆదరణ ఎక్కువ. కొన్ని తెలుగు చిత్రాలు హిందీలో అనువాదమై.. యూట్యూబ్‌లో లక్షల వీక్షకుల మనసు దోచాయి. టాలీవుడ్ హీరో రామ్ నటించిన మూడు చిత్రాలు ఒక్కొక్కటి 100 మిలియన్లకు(10 కోట్లు) పైగా వీక్షణలతో రికార్డు సృష్టించాయి. ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగు హీరోగా రామ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
ముచ్చటగా మూడు..
- 2016లో వచ్చిన 'నేను శైలజ' తెలుగులో సూపర్ హిట్టైంది. 'ది సూపర్ కిలాడీ3' పేరుతో హిందీలో డబ్బింగ్ అయిన ఈ చిత్రాన్ని... 105 మిలియన్ల(10.5 కోట్లు) మంది చూశారు.
- 2017లో వచ్చిన 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా 'నెం.1 దిల్వాలా' పేరుతో అనువాదించారు. ఈ సినిమా 118 మిలియన్ల(11.8 కోట్లు)వీక్షణలు అందుకుంది. 8లక్షల మందికి పైగా ఈ మూవీని లైక్ చేశారు.
- 2018లో వచ్చిన 'హలో గురు ప్రేమ కోసమే' సినిమా 'దమ్దార్ కిలాడీ' పేరుతో డబ్ చేశారు. ఈ చిత్రాన్ని 100 మిలియన్ల(10 కోట్లు) మంది వీక్షించారు.
ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో మంచి హిట్ అందుకున్న రామ్ ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా... 50 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఇది చదవండి: సాహో ప్రపంచ రికార్డ్... కలెక్షన్స్‌లో నంబర్ 2