ETV Bharat / state

అధికారపక్షం సభా సంప్రదాయాలను విస్మరించింది: చంద్రబాబు

author img

By

Published : Jun 13, 2019, 1:21 PM IST

చంద్రబాబు

ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్​ ఎంపికపై అధికార, ప్రతిపక్ష నేతల మాటల యుద్ధం జరిగింది. సభా సంప్రదాయాలను అధికారపక్షం విస్మరించిందని చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు ప్రసంగం
సభా సంప్రదాయాలను అధికారపక్షం విస్మరించిందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. సభాపతిగా తమ్మినేని పేరును ప్రకటించాక తమ పార్టీకి ఓ మాట కూడా చెప్పలేదన్నారు. ఈ రోజు ఉదయం కూడా స్పీకర్ ఎన్నికకు ప్రతిపక్ష నేత అయిన తనను రమ్మని పిలవలేదని వివరించారు. అవసరమైతే రండి... లేదంటే రావద్దు అన్నట్లు ముఖ్యమంత్రి ప్రవర్తించారని విమర్శించారు. గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్​గా కోడెలను ఎంపికచేసినప్పుడు జగన్ వద్దకు మంత్రులను పంపాకే నామినేషన్లు వేసినట్లు గుర్తు చేశారు. ఇవేకాక అంతకు మునుపు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంప్రదాయాలను విస్మరించలేదని అన్నారు. అధికార పక్షం సంప్రదాయాలను పాటించకపోయినప్పుటికీ తాము ప్రభుత్వానికి సహకరిస్తామని వెల్లడించారు. ప్రజలకు తెలయజెప్పేందుకే ఈ విషయాన్ని ప్రస్తావించానని.. ఎవరినీ విస్మరించడానికి కాదని స్పీకర్​కు వివరించారు.
Intro:slug: AP_CDP_36_13_POLICE_FIRYADU_AVB_C6
contributor: arif, jmd
() ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయినప్పటి నుంచి వైకాపా నాయకుల దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయని మాజీమంత్రి పొన్నపురెడ్డి -రామ సుబ్బారెడ్డి ఆరోపించారు. వైకాపా నాయకులు గ్రామాల్లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అదే జరిగితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పరిశ్రమలో పని చేస్తున్న తెదేపా వర్గానికి చెందిన ఉద్యోగులను ఇప్పుడు తొలగిస్తాసమనడం
ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కడప జిల్లా మైలవరం మండలం లోని సోలార్ పరిశ్రమలో 14 మంది కార్మికులను తొలగించి వైకాపా అనుచరులను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పడంతో రామసుబ్బా రెడ్డి గురువారం జమ్మలమడుగు గ్రామీణ పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు . కొన్నేళ్లుగా ఉద్యోగాలను.
నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారిని తొలగిస్తే ఊరుకునేది లేదన్నారు. పోలీసులు దీనిపై దృష్టి సారించి గ్రామాల్లో చిచ్చు పెట్ట కుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
బైట్ పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి మాజీ మంత్రి


Body:పోలీసులకు ఫిర్యాదు చేసిన తెదేపా నాయకులు


Conclusion:పోలీసులకు ఫిర్యాదు చేసిన తెదేపా నాయకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.