ETV Bharat / state

కలెక్టరేట్‌ను ముట్టడించిన భూనిర్వాసితులు

author img

By

Published : May 13, 2019, 7:18 PM IST

కలెక్టరేట్‌ను ముట్టడించిన భూనిర్వాసితులు

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్‌ను ముట్టడించారు. తమకు సరైన నష్టపరిహారం చెల్లించాలంటూ నినాదాలు చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లాలోని బిజినాపల్లి, తిమ్మాజిపేట మండలాల్లో జరుగుతున్న పనులను అడ్డుకున్న భూనిర్వాసితులు గత ఆరు రోజులుగా పనులు జరుగుతున్న చోట ధర్నా చేపడుతున్నారు. ఈరోజు జిల్లా పరిపాలనా కార్యాలయాన్ని ముట్టడించి తమకు న్యాయం చేయాలంటూ సంయుక్త పాలనాధికారి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ముట్టడి సమయంలో పోలీసులకు, భూనిర్వాసితులకు మధ్య తీవ్ర తోపులాట వాగ్వివాదం చోటుచేసుకుంది. మల్లన్నసాగర్‌లో రైతులకు నష్టపరిహారం చెల్లించిన విధంగానే తమకూ నష్టపరిహారం చెల్లించాలంటూ నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని డిమాండ్ చేశారు. అనంతరం భూనిర్వాసితులు స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడే బైటాయించి భోజనాలు చేసి నిరసన తెలిపారు.

కలెక్టరేట్‌ను ముట్టడించిన భూనిర్వాసితులు

ఇవీ చూడండి: పోలీస్ బైక్​పై కుటుంబసభ్యుల షికార్లు..!

Intro:TG_MBNR_2_13_BHOO_NIRVASITHULU_COLLECTORATE_MUTTADI_AVB_C8
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:9885989452
( ) పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులు నేడు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ను ముట్టడించారు. నాగర్ కర్నూల్ జిల్లా లో బిజినాపల్లి, తిమ్మాజిపేట మండలాల్లో జరుగుతున్న పనులను అడ్డుకున్న భూ నిర్వాసితులు గత ఆరు రోజులుగా పనులు జరుగుతున్న చోట ధర్నా చేపట్టారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి తమకు న్యాయం చేయాలంటూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ముట్టడి సమయంలో పోలీసులకు భూనిర్వాసితులకు మధ్య తీవ్ర తోపులాట వాగ్వాదం జరిగింది.మల్లన్న సాగర్ లో రైతులకు కు ఏ విధంగా నష్టపరిహారం చెల్లించారు...అదేవిధంగా నష్టపరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని డిమాండ్ చేశారు. అనంతరం భూ నిర్వాసితులు అంతా ఏకమై స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ను ముట్టడించి బైఠాయించారు. శాసనసభ్యులు ఇంటి ముందే కూర్చొని భోజనాలు చేసి నిరసన తెలిపారు. ఇంటికో ఉద్యోగం, భూములు కోల్పోయిన వారికి భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టిఇస్తానన్నారు...ఆ హామీలు ఎక్కడ పోయాయని ప్రభుత్వానికి ప్రశ్నించారు....AVB
Byte:- భూ నిర్వాసితురాలు.


Body:TG_MBNR_2_13_BHOO_NIRVASITHULU_COLLECTORATE_MUTTADI_AVB_C8


Conclusion:TG_MBNR_2_13_BHOO_NIRVASITHULU_COLLECTORATE_MUTTADI_AVB_C8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.