ETV Bharat / sitara

మూడొందల కోట్లకు చేరువలో 'సాహో' వసూళ్లు

author img

By

Published : Sep 2, 2019, 6:03 PM IST

Updated : Sep 29, 2019, 4:50 AM IST

సాహో సినిమాలో ప్రభాస్

డార్లింగ్ ప్రభాస్ నటించిన 'సాహో'.. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.294 కోట్ల గ్రాస్​ సాధించింది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

యంగ్​ రెబల్ స్టార్ ప్రభాస్​ 'సాహో' బాక్సాఫీస్​ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కోట్లకు కోట్లు వసూళ్లు సాధిస్తూ రికార్డులు నమోదు చేస్తోంది. విడుదలైన మూడు రోజుల్లో రూ.294 కోట్ల గ్రాస్​ సాధించిందని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​.. సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది.

దక్షిణాది సినిమా అయినప్పటికీ ఉత్తరాదిలోనూ 'సాహో' సునామీ సాగుతోంది. అక్కడ మూడు రోజుల్లో రూ.79.08 కోట్ల షేర్​ దక్కించుకున్నట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్​ ఆదర్శ్​ ​ ట్విట్టర్​లో వెల్లడించాడు. ఇలా అన్నిచోట్ల వసూళ్ల పరంపర కొనసాగిస్తున్న 'సాహో'.. ఈ వారంలో ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.

యాక్షన్ ఎంటర్​టైనర్​గా రూపొందిన 'సాహో'లో శ్రద్ధా కపూర్ హీరోయిన్. అరుణ్ విజయ్, జాకీష్రాఫ్, మందిరా బేడీ, మహేశ్​ మంజ్రేకర్, టిను ఆనంద్, చుంకీ పాండే లాంటి నటులు కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్​ నిర్మాతగా వ్యవహరించింది.

ఇది చదవండి: 'వాల్మీకి' తోడుగా శ్రీదేవి ఉండగా.. అభిమానులకు పండగే

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
AP Video Delivery Log - 0500 GMT News
Monday, 2 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0446: US TX Shooting Vigil 2 AP Clients Only 4227748
Hundreds of Texas residents grieve at prayer vigil
AP-APTN-0358: Afghanistan The Voiceless AP Clients Only 4227746
War-weary Afghans have small say in country's fate
AP-APTN-0349: Thailand SKorea Moon AP Clients Only 4227745
PM Chan-ocha welcomes Pres. Moon to Thailand
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated :Sep 29, 2019, 4:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.