న్యాయవ్యవస్థను అస్థిరపరిచే కుట్ర: సీజేఐ

author img

By

Published : Apr 20, 2019, 12:36 PM IST

Updated : Apr 20, 2019, 7:33 PM IST

భారత ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ద్వారా దేశ న్యాయవ్యవస్థ అత్యంత తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు సీజేఐపై ఆరోపణలు చేసినట్లుకొన్ని వార్తా పోర్టళ్లు ప్రసారం చేయడంపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. వచ్చేవారం కీలకమైన కేసుల విచారణ ఉన్నందునే తనపై ఆరోపణలు చేస్తున్నారని సీజేఐ తెలిపారు.

న్యాయవ్యవస్థను బలహీన పరిచే కుట్ర: సీజేఐ

భారత న్యాయవ్యవస్థ చరిత్రలో మరో సంచలనం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. 22 మంది సుప్రీం న్యాయమూర్తులకు.. ఆరోపించిన మహిళ పంపిన ప్రమాణపత్రం శనివారం బహిర్గతమైంది. వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది.

ఈ ఆరోపణల వెనుక అతిపెద్ద శక్తి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది. వచ్చేవారం కీలకమైన కేసుల విచారణ ఉన్నందునే తనపై ఆరోపణలు చేస్తున్నారని సీజేఐ తెలిపారు. మాజీ ఉద్యోగి ఆరోపణలపై జస్టిస్​ రంజన్​ గొగొయి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

"ఆరోపణలు నన్నెంతో బాధించాయి. ఇవన్నీ నిరాధారం. 4 మీడియా సంస్థలు ఈ కథనాలు ప్రచురించాయి. ఆయా సంస్థల నుంచి నాకు ఈ విషయంపై సమాచారం అందింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు పెను ముప్పు పొంచి ఉంది. న్యాయవ్యవస్థను అస్థిరపరిచేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది. ఆరోపణలు చేసిన మహిళ వెనుక శక్తిమంతమైన వారు ఎవరో ఉన్నారు.

ఈ ఆరోపణలు నమ్మశక్యంగా లేవు. వాటిని ఖండించడానికి నా స్థాయి తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించడంలేదు. 20ఏళ్లు న్యాయమూర్తిగా పనిచేసినా నా బ్యాంకు బ్యాలెన్స్​ రూ. 6.80లక్షలు మాత్రమే. డబ్బు విషయంలో నన్ను ఎవరూ దోషిగా చూపలేక కొందరు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

ఈ వ్యవహారం వెనుక ఏదో పెద్ద శక్తి ఉంది. సీజేఐ కార్యాలయాన్నే వారు నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. 20ఏళ్లు సేవలందించాక భారత ప్రధాన న్యాయమూర్తికి లభించే బహుమానం ఇదేనా? నేను ఈ పదవిలోనే కొనసాగుతా. ఎలాంటి భయం లేకుండా నా విధులు నిర్వర్తిస్తా. న్యాయవ్యవస్థ బలి పశువు కారాదు."

- జస్టిస్​ రంజన్​ గొగొయి, భారత ప్రధాన న్యాయమూర్తి

ఈ విషయంలో మీడియా వి‌జ్ఞత పాటించాలని కోరిన ధర్మాసనం.. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఎలాంటి ప్రభావం పడబోదన్నారు. న్యాయవ్యవస్థ అత్యంత తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొంటోందన్న ధర్మాసనం ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి అని వ్యాఖ్యానించింది. నీతినియమాలు లేని ఆరోపణలతో భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని నీరుగార్చేందుకు ఓ పెద్దశక్తి ప్రయత్నం చేస్తోందని ధర్మాసనం పేర్కొంది.

ఈ ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్‌ అరుణ్ మిశ్రా, జస్టిస్‌ సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో ఆదేశాలు జారీచేసే అంశాన్ని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాకు విడిచిపెడుతున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

ఈ దశలో ఎలాంటి న్యాయఆదేశాలు జారీచేయడం లేదన్న జస్టిస్ మిశ్రా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సంయమనం పాటించాలని మీడియాకు సూచించారు.

ఏ న్యాయమూర్తి అయినా ఖ్యాతిని మాత్రమే కోరుకుంటారని జస్టిస్‌రంజన్ గొగొయి వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆరోపణలు వస్తే కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారా అని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేసిన మహిళకు నేర చరిత్ర ఉందని, ఆమెపై..రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదై ఉన్నట్టు సీజేఐ చెప్పారు.

ఆమె సుప్రీంకోర్టు ఉద్యోగిగా ఉన్నప్పుడు ఒక ఎఫ్​ఐఆర్ పెండింగ్‌లో ఉందన్నారు. ఎఫ్​ఐఆర్ పెండింగ్‌లో ఉండగా ఆమె సుప్రీంకోర్టు ఉద్యోగి ఎలా అయ్యారని జస్టిస్​ రంజన్​ గొగొయి ప్రశ్నించారు. ఆమె భర్తపైనా రెండు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఆమెపై మూడో కేసు కూడా నమోదై అరెస్ట్ అయ్యారన్న సీజేఐ బెయిల్‌పై వచ్చి ఫిర్యాదుదారులనే బెదిరించినట్లు చెప్పారు.

4 రోజులు జైల్లో కూడా ఉన్న ఆ మహిళను తీరు మార్చుకోవాలని పలుమార్లు పోలీసులు హెచ్చరించారన్నారు. తీరు మార్చుకోనందునే ఆమె బెయిల్‌రద్దు చేయాలని పోలీసులు కింది కోర్టుకు వెళ్లారని చెప్పారు. గతంలో సుప్రీంకోర్టు విశ్రాంతన్యాయమూర్తి, సీనియర్‌న్యాయవాదిపైనా ఇలాంటి ఆరోపణలు చేసినట్లు అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్ ధర్మాసనానికి వివరించారు.

సీజేఐపై చేసిన ఆరోపణలు బ్లాక్‌మెయిలింగ్‌లా ఉన్నాయన్న సోలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా ఆమెపై దర్యాప్తు చేయాలని అభిప్రాయపడ్డారు.

ఆ మహిళలను నిబంధనల ప్రకారమే విధుల నుంచి తొలిగించినట్లు చెప్పిన జస్టిస్ ఖన్నా ఇప్పుడు అకస్మాత్తుగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

సీజేఐపై మహిళ చేసిన లైంగిక దాడి ఆరోపణల పత్రం నకళ్లు 22 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు చేరాయి. వాటిని గమనించిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ న్యాయవ్యవస్థ స్వతంత్రతకే సవాల్ విసురుతున్న అతిపెద్ద ప్రజాప్రయోజన అంశంపై సీజేఐ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపడుతుందని తెలిపారు.

మరోవైపు సీజేఐపై ఆరోపణలు చేసిన మహిళ బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని ఈనెల 24న న్యాయస్థానం విననుంది.

ఇదీ చూడండి: పొరపాటున భాజపాకు ఓట్​- కోపంతో వేలు కట్​

Kolkata (West Bengal), Apr 20 (ANI): Royal Challengers Bangalore (RCB) ended their five-match losing streak against Kolkata Knight Riders (KKR) as they defeated them by 10 runs in the 12th edition of the Indian Premier League (IPL) at the Eden Gardens stadium on Friday. Post match, RCB bowler Navdeep Saini spoke to mediapersons about his experience of playing at Eden Gardens. Saini said, "This wicket has bounce because we have played in other wickets too but I never found this kind of bounce ever. Our plan for today's match was just to bowl in good length because the pitch had extra bounce and even, when I was bowling to Russell, it had that typical extra bounce" Saini also spoke about the last over he bowled to Russell and their immediate planning for last over.
Last Updated :Apr 20, 2019, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.