'మొక్కలు నాటి... అమెజాన్​ అడవులకు ఊపిరిపోద్దాం'

author img

By

Published : Aug 23, 2019, 3:33 PM IST

Updated : Sep 28, 2019, 12:13 AM IST

అమెజాన్ ()

ప్రపంచంలో అత్యంత పొడవైన వర్షాధార ఉష్ణమండల అడవి(రెయిన్​ ఫారెస్ట్​) అమెజాన్. భూమికి దాదాపు 20 శాతం ప్రాణవాయువు అందిస్తోన్న ఈ ప్రాంతంలో.. అగ్ని ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. ఈ ఘటనపై ప‌ర్యావ‌ర‌ణవేత్త‌లు, శాస్త్ర‌వేత్త‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కల సంరక్షణకు పూనుకోవాలని కోరుతున్నారు. తాజాగా టాలీవుడ్​ హీరోలు మహేశ్​బాబు, అల్లు అర్జున్, సాయిధరమ్​ తేజ్​ స్పందించారు.

భూమికి అధిక స్థాయిలో ప్రాణ‌వాయువును అందించే అమెజాన్ అడ‌వులు... ఇటీవల కాలంలో తరచుగా అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి. బ్రెజిల్‌లో ఉన్న ఈ వన్య ప్రాంతం ప్ర‌తి ఏడాది రికార్డు స్థాయిలో ద‌గ్ధం అవుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు 85 శాతం ఎక్కువగా మంటలకు ఆహుతైందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్ల‌డించింది. ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు, శాస్త్ర‌వేత్త‌లు, సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఈ విషయంపై స్పందిస్తున్నారు. ఇప్ప‌టికైనా మేల్కొని అమెజాన్‌ని కాపాడుకుందామని పిలుపునిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోలు మహేశ్​ బాబు, అల్లు అర్జున్, సాయి ధరమ్ ​తేజ్​ నెటిజన్లకు సోషల్​మీడియా వేదికగా సందేశాన్నిచ్చారు.

"20 శాతం ఆక్సిజ‌న్‌ అందించే అమెజాన్ అడవులు మంట‌ల్లో కాలిపోతున్నాయి. ఈ వార్త చాలా బాధాక‌రం. ఇప్ప‌టికైనా మేల్కొని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ని కాపాడుకుందాం. జీవ వైవిధ్యం చాలా దెబ్బతింటోంది. మన భూమిని రక్షించుకోవడానికి మన వంతు కృషి చేద్దాం. పచ్చని వాతావ‌ర‌ణం కోసం ఒక అడుగు ముందుకు వేయండి. దీనిని మ‌న ఇంటి నుంచి ప్రారంభిద్దాం".
- మ‌హేశ్​బాబు, సినీ నటుడు

ప్రపంచంలోని అతిపెద్ద అడవులు, మనకు 20 శాతం ఆక్సిజన్ అందించే అడవులు, పది లక్షల మంది ప్రజలకు, లక్షలాది వన్యప్రాణులకు ఆధారమైన అడవులు కాలిపోతున్నాయి. దీని వల్ల వాతావరణంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఈ ఘటన నా హృదయాన్ని ఎంతో బాధిస్తోంది.
-అల్లు అర్జున్, హీరో

​"భూమికి ఊపిరితిత్తుల్లా ఉన్న అమెజాన్​ అడవి తగలబడిపోతుండటం చాలా బాధాకరం. నిజంగా ఇది ఊపిరిపీల్చుకోనివ్వని సంగతి. వన్య ప్రాంతం తగలబడిపోతుంటే ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాం. ఒక ట్వీట్​ చేయడం, ఇన్​స్టా పోస్టు పెట్టడం, మంటలు తగ్గాలని కోరుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. కానీ చెట్లు నాటి భూమిని రక్షించుకునే అవకాశం ఇంకా మన చేతుల్లోనే ఉంది".
-సాయి ధరమ్​ తేజ్​, సినీ నటుడు

  • It’s been really suffocating to see that our lungs of the planet #AmazonForest are on fire and we’re not able to do anything and the only thing we can do is tweet or put up an Instagram post...hope the fire subsides and hope we can make it up for our planet by planting trees 🙏🏼🙏🏼 pic.twitter.com/5aNvjVEbDw

    — Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాలీవుడ్ నటీనటులు అక్షయ్ కుమార్, ఆలియా భట్, అనుష్క శ‌ర్మ‌, అర్జున్ క‌పూర్, దిశా పటానీతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు మొక్కలు నాటి భూమిని కాపాడుకుందామని సామాజిక మాధ్యమాల వేదిక‌గా నెటిజ‌న్లను కోరుతున్నారు.

ఇవీ చూడండి.. 'రాజ్​తరుణ్​ తాగాడా లేదా అన్నది ఇప్పుడు తెలియదు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY  
Bangkok – 23 August 2019
1. US Senator Tammy Duckworth entering the room
2. Cutaway of press
3. Mid of Duckworth
4. Various of Thai Prime Minister Prayuth Chan-ocha arriving and shaking hands with Duckworth
5. Various of meeting
6. Various exterior shots of Thai government house
STORYLINE:
US Senator Tammy Duckworth met with the Thai Prime Minister Prayuth Chan-ocha Friday during a visit to Bangkok at the invitation of the country's royal military academy.
Prayuth thanked Duckworth for being the first US senator to meet with his government since the junta's rule officially ended in July.
The lawmaker, whose mother is Thai, also met with Thai members of parliament and will visit hospitals for veterans and people with disabilities before stopping in her mother's hometown in the northern province of Chiang Mai.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated :Sep 28, 2019, 12:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.